నారావారబ్బాయి తగ్గడా..? | No Change In Nara Rohith | Sakshi
Sakshi News home page

నారావారబ్బాయి తగ్గడా..?

Aug 17 2016 11:28 AM | Updated on Sep 4 2017 9:41 AM

నారావారబ్బాయి తగ్గడా..?

నారావారబ్బాయి తగ్గడా..?

సోలో, ప్రతినిథి, రౌడీఫెలో లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నారా రోహిత్. స్టోరి సెలక్షన్ పర్ఫామెన్స్ విషయంలో మంచి మార్కులు సాధిస్తున్న రోహిత్.. లుక్ విషయంలో...

సోలో, ప్రతినిథి, రౌడీఫెలో లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు నారా రోహిత్. స్టోరి సెలక్షన్ పర్ఫామెన్స్ విషయంలో మంచి మార్కులు సాధిస్తున్న రోహిత్.. లుక్ విషయంలో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త పరవాలేదనిపించినా.. ఇటీవల సినిమాల్లో బాగా లావుగా కనిపిస్తున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన తుంటరి, సావిత్రి, రాజా చెయ్యు వేస్తే సినిమాల్లో రోహిత్ లుక్ పై చాలా కామెంట్స్ వచ్చాయి.

ఈ కామెంట్స్ రోహిత్ వరకు చేరటంతో తన నెక్ట్స్ సినిమాలకు కేర్ తీసుకుంటానంటూ ప్రకటించాడు. అంతేకాదు ఒక సందర్భంలో రోహిత్ సిక్స్ ప్యాక్ కోసం కష్టపడుతున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలన్ని ఉత్తిదే అని తేలిపోయింది. ఇటీవల విడుదలైన జ్యో అచ్యుతానంద టైలర్ లోనూ నారా రోహిత్ బొద్దుగానే కనిపిస్తున్నాడు. కంటెంట్ పరంగా సినిమా మీద మంచి అంచనాలే ఉన్నా.. మరో సారి ఈ సినిమాకు రోహిత్ లుక్స్ మైనస్ అవుతుందేమో అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement