బాయ్‌ఫ్రెండ్స్‌తో.. నేనా? | No boy friends heebah patel | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్స్‌తో.. నేనా?

Dec 11 2016 11:15 PM | Updated on Jul 12 2019 3:07 PM

బాయ్‌ఫ్రెండ్స్‌తో.. నేనా? - Sakshi

బాయ్‌ఫ్రెండ్స్‌తో.. నేనా?

బాయ్‌ఫ్రెండ్స్‌తో సరదాలు, షికార్లు సినిమాల్లోనే. ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ అమ్మాయిల కాలేజీలో చదివా.

 ‘‘బాయ్‌ఫ్రెండ్స్‌తో సరదాలు, షికార్లు సినిమాల్లోనే. ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ అమ్మాయిల కాలేజీలో చదివా. తర్వాత సినిమాల్లోకి వచ్చేశా. కొందరు అబ్బాయిలపై మనసుపడ్డా. కానీ, రియల్ లైఫ్‌లో నాకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వాళ్లతో తిరిగేంత టైమ్ లేదు’’ అన్నారు హెబ్బా పటేల్. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ ముఖ్యతారలుగా భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన సినిమా ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ 16న రిలీజవుతోన్న ఈ సినిమా గురించి హెబ్బా పటేల్ మాట్లాడుతూ - ‘‘ఇందులో పద్మావతిగా చేశా.
 
  తండ్రి గారాబంగా పెంచిన ఆ అమ్మాయి సిటీకి వచ్చిన తర్వాత ముగ్గుర్ని ప్రేమిస్తుంది. ఆమె చేసే తప్పుల వల్ల మిగతావాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆమె తండ్రి ఏం చేశాడనేది చిత్రకథ. తండ్రికూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే సినిమా. ‘అలా ఎలా?’, ‘కుమారి 21ఎఫ్’ తర్వాత ‘దిల్’ రాజుగారు మరోసారి నా సినిమా రిలీజ్ చేస్తున్నారు. ‘మిస్టర్’, ‘ఏంజిల్’, ‘అంధగాడు’ చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement