తెలీక చేశాను.. సారీ! | Niveditha Apologized for Kiki Challenge Video | Sakshi
Sakshi News home page

Aug 4 2018 10:51 AM | Updated on Aug 4 2018 2:45 PM

Niveditha Apologized for Kiki Challenge Video - Sakshi

ప్రాణాల మీదకు తెచ్చుకోమ్మని చెబుతానా?

సాక్షి, బెంగళూరు: కీకీ ఛాలెంజ్‌ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న శాండల్‌వుడ్‌ నటి నివేదిత గౌడ ఎట్టకేలకు స్పందించారు. ఆ ఛాలెంజ్‌ను నిషేధించిన విషయం తెలీక తాను తప్పు చేశానని ఆమె క్షమాపణలు చెప్పారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో కీకీ ఛాలెంజ్‌ వీడియో చూసి సరదాగా ప్రయత్నించా. అంతేగానీ దాన్ని నిషేధించారన్న విషయం నాకు తెలీదు. నాపై విమర్శలు వెల్లువెత్తిన సమయంలో నన్ను కావాలని టార్గెట్‌ చేశారేమో అనిపించింది. విషయం తెలిశాక వేరే వాళ్లు ప్రయత్నించకూడదన్న ఉద్దేశంతో ఆ వీడియోను తొలగించా. ప్రాణాల మీదకు తెచ్చుకోవాలని ప్రజలకు చెప్పేంత మూర్ఖురాలిని కాదు కదా!. క్షమించండి’ అని ఓ జాతీయ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. (కీకీ ఛాలెంజ్‌.. దమ్ముంటే ఇలా చేయండి)

18 ఏళ్ల నివేదిత గౌడ కన్నడ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా ఫుల్‌ పాపులారిటీ సంపాదించుకున్నారు. కీకీ ఛాలెంజ్‌ విమర్శల నేపథ్యంలో ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది.  నివేదితపై బెంగళూరు పోలీసులకు ఓ ఉద్యమవేత్త ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  ఇదిలా ఉంటే కీకీ డాన్స్‌తో డాన్స్‌ కిక్‌ రాదని, కటకటాల కిక్‌ మాత్రమే వస్తుందని బెంగళూరు పోలీసులు నెటిజన్లను హెచ్చరించారు.

నటి రెజీనా కికి వీడియో వైరల్‌.. విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement