అభిమాన దర్శకుడికి షాక్ ఇస్తుందా..? | Nithya has to fight with her favorite director trivikram srinivas | Sakshi
Sakshi News home page

అభిమాన దర్శకుడికి షాక్ ఇస్తుందా..?

Jun 7 2016 8:44 AM | Updated on Sep 4 2017 1:55 AM

అభిమాన దర్శకుడికి షాక్ ఇస్తుందా..?

అభిమాన దర్శకుడికి షాక్ ఇస్తుందా..?

ఫిలిం ఇండస్ట్రీలో సావిత్రి, సౌందర్య లాంటి అతి కొద్ది మందినే గొప్ప నటీమణులుగా చెపుతుంటారు. చాలా వరకు హీరోయిన్లు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా హీరోయిజం మీదే...

ఫిల్మ్ ఇండస్ట్రీలో సావిత్రి, సౌందర్య లాంటి అతి కొద్ది మందినే గొప్ప నటీమణులుగా చెపుతుంటారు. చాలా వరకు హీరోయిన్లు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా హీరోయిజం మీదే సినిమాలు నడుస్తున్న ప్రజెంట్ ట్రెండ్లో హీరోయిన్ల పాత్ర కేవలం పాటలకు గ్లామర్ షోకు మాత్రమే పరిమితమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటున్న నటి నిత్యా మీనన్.

క్యారెక్టర్ల విషయంలో చాలా సెలెక్టివ్గా ఉండే నిత్యా మీనన్, పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇండస్ట్రీలో మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్గా ఉన్న నిత్యామీనన్కు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమాన దర్శకుడు. అయితే ఈ వారం తన అభిమాన దర్శకుడితోనే పోటికి రెడీ అవుతోంది ఈ మళయాలి బ్యూటి.

గత శుక్రవాం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  వేరే ఏ సినిమా పోటీ లేకపోవటంతో అ..ఆ.. మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. కానీ ఈ వారం రిలీజ్ అవుతున్న ఒక్క అమ్మాయి తప్ప, అ..ఆ.. కలెక్షన్లకు బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. రోడ్ డ్రామాగా ఎక్స్ పరిమెంటల్ జానర్లో తెరకెక్కిన ఒక్క అమ్మాయి తప్ప సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

సందీప్ కిషన్, నిత్యా మీనన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ వస్తే భారీ వసూళ్లను సాధించటం కాయంగా కనిపిస్తోంది. అదే గనుక జరిగితే అ..ఆ.. హవాకు బ్రేక్ పడినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి తన ఫేవరేట్ డైరెక్టర్కు నిత్యా మీనన్ ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement