మూడో సినిమా కూడా లైన్లో పెట్టాడు | Nithins next will be launch soon | Sakshi
Sakshi News home page

మూడో సినిమా కూడా లైన్లో పెట్టాడు

Feb 8 2017 3:00 PM | Updated on Mar 22 2019 5:33 PM

మూడో సినిమా కూడా లైన్లో పెట్టాడు - Sakshi

మూడో సినిమా కూడా లైన్లో పెట్టాడు

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన యంగ్ హీరో నితిన్, షార్ట్ గ్యాప్ తరువాత వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన యంగ్ హీరో నితిన్, షార్ట్ గ్యాప్ తరువాత వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హనురాఘవపూడి దర్శకత్వంలో డిఫరెంట్ లుక్లో ఓ సినిమా చేస్తున్న నితిన్, మరో సినిమాను కూడా లాంచనంగా ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్లు సంయుక్తంగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను కూడా స్టార్ చేశాడు.

ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తాజాగా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు నితిన్. బెంగాల్ టైగర్ సినిమాను నిర్మించిన కె.కె.రాధామోహన్, భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరగుతుండగా త్వరలోనే నటీనటులతో పాటు దర్శకుణ్ని కూడా ఫైనల్ చేయనున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నితిన్ రెండు సినిమాలు పూర్తవ్వగానే ఆగస్టు నుంచి కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement