ఎన్టీఆర్ డ్యాన్స్ కేక | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ డ్యాన్స్ కేక

Published Fri, Jun 10 2016 11:38 PM

ఎన్టీఆర్ డ్యాన్స్ కేక

ఒక హీరో షూటింగ్ లొకేషన్‌కి మరో హీరో వెళ్లడం కామన్‌గా జరుగుతుంటుంది. పక్క పక్క లొకేషన్లో షూటింగ్ చేస్తున్నప్పుడో, పని గట్టుకునో వెళుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం షూటింగ్ లొకేషన్‌కి నితిన్ పని గట్టుకుని వెళ్లారని తెలుస్తోంది. ‘‘ఈ రోజు (శుక్రవారం) ‘జనతా గ్యారేజ్’ సెట్స్‌కు వెళ్లా. చాలా రోజుల తర్వాత తారక్‌ను కలిశా. ఆయన డ్యాన్స్ కేక’’ అని హీరో నితిన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దాంతోపాటు తారక్ తో కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణా ఏడెకరాలలో జరుగుతోంది. ఎన్టీఆర్, సమంతపై చిత్రీకరిస్తున్న పాట కోసం అక్కడ మూడు భారీ సెట్స్ వేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శేఖర్ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు. గురువారం మొదలైన ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరుకి టాకీ పార్ట్ పూర్తవుతుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement