రీమేక్కు రెడీ అవుతున్న నితిన్ | nithin planing to remake tamil super hit eetti | Sakshi
Sakshi News home page

రీమేక్కు రెడీ అవుతున్న నితిన్

Dec 20 2015 9:12 AM | Updated on Sep 3 2017 2:18 PM

రీమేక్కు రెడీ అవుతున్న నితిన్

రీమేక్కు రెడీ అవుతున్న నితిన్

అఖిల్ సినిమా ఫెయిల్యూర్తో ఆర్ధికంగా దెబ్బతిన్న నితిన్ తిరిగి సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ..ఆ..( అనసూయ రామలింగం...

అఖిల్ సినిమా ఫెయిల్యూర్తో ఆర్ధికంగా దెబ్బతిన్న నితిన్ తిరిగి సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ..ఆ..( అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి ) సినిమాలో నటిస్తున్నాడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.

ఇటీవల తమిళ్లో విడుదలై ఘనవిజయం సాధించిన ఎట్టి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఒరిజినల్ సినిమాకు నిర్మాత దర్శకులుగా వ్యవహరించిన వారే ఈ సినిమాను కూడా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. మరి తెలుగులో ఈ స్పోర్ట్స్ డ్రామాలో నటించడానికి నితిన్ అంగీకరిస్తాడో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement