నితిన్ కోసం పక్కా ప్లానింగ్ | Nithin Next Movie details | Sakshi
Sakshi News home page

నితిన్ కోసం పక్కా ప్లానింగ్

Jan 19 2017 10:31 AM | Updated on Sep 5 2017 1:37 AM

నితిన్ కోసం పక్కా ప్లానింగ్

నితిన్ కోసం పక్కా ప్లానింగ్

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో చేరిన యంగ్ హీరో నితిన్, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత హను రాఘవపూడి

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో చేరిన యంగ్ హీరో నితిన్, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభించాడు. గతంలో ఏ సినిమా కోసం లుక్ విషయంలో పెద్దగా మార్పులు చేయని నితిన్ ఈ సినిమా న్యూ లుక్లో దర్శనమివ్వమనున్నాడు.

ఓల్డ్ సిటీ కుర్రాడిగా కనిపించేందుకు భారీగా గడ్డం పెంచేసి రఫ్ లుక్లోకి మారిపోయాడు నితిన్. అంతేకాదు నితిన్కు ప్రతినాయకుడిగా ఒకప్పటి యాక్షన్ హీరో అర్జున్ను ఎంపిక చేశారు. ఈ సీనియర్ నటుడు స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను ఎంపిక చేశారు. సినిమాకు నేపథ్య సంగీతం కీలకం కావటంతో మణిశర్మ అయితే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement