22 డేస్‌ టు గో! | nithen movie shooting start shortley | Sakshi
Sakshi News home page

22 డేస్‌ టు గో!

Jun 4 2017 12:23 AM | Updated on Mar 22 2019 5:33 PM

22 డేస్‌ టు గో! - Sakshi

22 డేస్‌ టు గో!

అటు అభిమానులకు, ఇటు హీరోలకు కిక్కిచ్చే కాంబినేషన్లు కొన్ని ఉంటాయి.

అటు అభిమానులకు, ఇటు హీరోలకు కిక్కిచ్చే కాంబినేషన్లు కొన్ని ఉంటాయి. పవన్‌–త్రివిక్రమ్‌–నితిన్‌ కాంబినేషన్‌ అటువంటిదే. ఆత్మీయ మిత్రుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలసి వీరాభిమాని నితిన్‌ హీరోగా పవన్‌కల్యాణ్‌ ఓ సినిమా నిర్మిస్తున్నారనే వార్త ప్రేక్షకులకు భలే కిక్‌ ఇచ్చింది. నితిన్‌ కూడా చాలా ఎగ్జయిట్‌ అయ్యారు.

గతేడాది నవంబర్‌లో కృష్ణచైతన్య దర్శకుడిగా ప్రారంభమైన ఈ సినిమా గురించి మరో వార్త లేకపోయే సరికి కాస్త కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అయింది. అసలు, ఈ సినిమా ఏమైందని ఆరా తీస్తే... ఈ నెల 26న రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని ప్రొడక్షన్‌ హౌస్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్రివిక్రమ్‌ అందించిన మూలకథకు కృష్ణచైతన్య ఫుల్‌ బౌండ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశారట. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లై’ సినిమా చిత్రీకరణ నిమిత్తం నితిన్‌ అమెరికాలో ఉన్నారు. ఈనెల 14తో ‘లై’ అమెరికా షెడ్యూల్‌ పూర్తవుతుంది.  ఆ తర్వాత కొంచెం రెస్ట్‌ తీసుకుని కృష్ణచైతన్య సినిమా ప్రారంభిస్తారన్న మాట!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement