తల్లి అయిన మాజీ హీరోయిన్! | nisha agarwal blessed with baby boy | Sakshi
Sakshi News home page

తల్లి అయిన మాజీ హీరోయిన్!

Feb 22 2018 3:00 PM | Updated on Oct 30 2018 5:58 PM

nisha agarwal blessed with baby boy - Sakshi

​‘ఏమైంది ఈ వేళ’, ‘సోలో’ లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నిషా అగర్వాల్ ఇటీవల పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో నిషా ఇంట పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక కాజ‌ల్‌ అగర్వాల్‌ ఆ బాబుని ముద్దాడుతూ దిగిన ఓ ఫోటోని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో పాటు నిషా కొడుకు పేరు ‘ఇషాన్‌ వాలేదా’ అని అందరికి పరిచయం చేసింది. 

నిషా కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ తన అక్కలాగా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. ఆమె నటించిన ఏమైంది ఈ వేళ, సోలో వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ వంటి సినిమాల్లో నటించింది. అనంతరం ముంబైకి చెందిన వ్యాపారవేత్త కరణ్‌ను నిషా 2013లో పెళ్లి చేసుకుంది. నిషా పెళ్ళి అయిన తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక కాజల్ అగర్వాల్ ఇటీవల ‘అ’  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్‌ క‌ళ్యాణ్ రామ్‌కి జంటగా ‘ఎంఎల్ఏ’  సినిమాలో న‌టిస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement