వెరైటీ టైటిల్తో వస్తోన్న నిఖిల్ | nikhil Next movie title yekkadiki pothavu chinnavada | Sakshi
Sakshi News home page

వెరైటీ టైటిల్తో వస్తోన్న నిఖిల్

May 19 2016 11:48 AM | Updated on Sep 4 2017 12:27 AM

వెరైటీ టైటిల్తో వస్తోన్న నిఖిల్

వెరైటీ టైటిల్తో వస్తోన్న నిఖిల్

రెగ్యులర్ జానర్కు భిన్నంగా ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్, తన లేటెస్ట్ సినిమా శంకరాభరణంతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు, దీంతో మరోసారి ఆలోచనలో...

రెగ్యులర్ జానర్కు భిన్నంగా ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్, తన లేటెస్ట్ సినిమా శంకరాభరణంతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు, దీంతో మరోసారి ఆలోచనలో పడ్డ కుర్ర హీరో ప్రస్తుతం టైగర్ ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో 'అమల' అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చినా చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు.

ప్రస్తుతం ఓ అచ్చమైన తెలుగు టైటిల్ను పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే నిఖిల్ ఇమేజ్తో పాటు కథకు కూడా సెట్ అయ్యేలా, 'ఎక్కడి పోతావు చిన్నవాడా..?' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవల అచ్చమైన తెలుగు పేర్లతో వస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తుండటంతో ఈ టైటిల్ నిఖిల్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా..?' టైటిల్ను చిత్రయూనిట్ అఫీషియల్గా ఎనౌన్స్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement