సుకుమార్‌ సినిమాలో నిఖిల్‌

Nikhil Next Film With Sukumar And Allu Arvind - Sakshi

యంగ్ హీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల విడుదల అయిన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఆ ఉత్సాహంతో నిఖిల్‌ తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సుకుమార్‌ కథ - స్క్రీన్ ప్లేను అందించడం విశేషం. సుకుమార్ శిష్యుడైన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు.  ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

గతంలో సుకుమార్ అందించిన కథతో సూర్యప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్‌ విజయవంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top