కొత్త హీరో కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు | Nikhil Gowda next movie with tollywood top director | Sakshi
Sakshi News home page

కొత్త హీరో కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Sep 21 2016 2:36 PM | Updated on Mar 22 2019 1:53 PM

కొత్త హీరో కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు - Sakshi

కొత్త హీరో కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా జాగ్వర్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ కుమార్ను హీరోగా పరిచేయం చేస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని...

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా జాగ్వర్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ కుమార్ను హీరోగా పరిచేయం చేస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆడియో రిలీజ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతీ విషయంలోనూ అదే భారీతనాన్ని చూపిస్తున్నారు.

అయితే తొలి సినిమా రిలీజ్ కాక ముందే నిఖిల్ కుమార్ రెండో సినిమా కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టాడు. ఈ విషయాన్ని నిఖిల్ తండ్రి జాగ్వర్ నిర్మాత కుమారస్వామి స్వయంగా ప్రకటించారు. నిఖిల్ రెండో సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, పూరి జగన్నాథ్లలో ఒకరు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. నిఖిల్ తొలి సినిమాను పూరినే డైరెక్ట్ చేయాల్సి ఉండగా కథ సెట్ కాకపోవటంతో విరమించుకున్నారు. జాగ్వర్ రిలీజ్ తరువాత నిఖిల్ నెక్ట్స్ సినిమాకు దర్శకుడెవరో ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement