స్టింగ్‌ ఆపరేషన్‌ | Nikhil excited to play a journalist in Mudra | Sakshi
Sakshi News home page

స్టింగ్‌ ఆపరేషన్‌

Sep 9 2018 4:42 AM | Updated on Sep 9 2018 4:42 AM

Nikhil excited to play a journalist in Mudra - Sakshi

నిఖిల్‌

చేతిలో కెమెరా పట్టుకుని అక్కడే వెయిట్‌ చేస్తున్నారు హీరో నిఖిల్‌. క్లాక్‌ తిరుగుతూనే ఉంది. టైమ్‌ గడిచిపోతోంది. అతను మాత్రం అక్కడి నుంచి కదలడం లేదు. కావాల్సిన సమాచారం సేకరించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని పట్టుదలగా ఉన్నాడు. ఈ పట్టుదల ఎందుకంటే అతను చేస్తున్న స్టింగ్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ కావడానికి.

మరి... స్టింగ్‌ ఆపరేషన్‌ ఏ క్రిమినల్‌ బెండు తీసింది అనేది వెండితెరపై తెలుస్తుంది. నిఖిల్‌ హీరోగా టీ.ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ముద్ర’. తమిళ సినిమా ‘కణిదన్‌’కి ఇది రీమేక్‌. ఇందులో లావణ్యా త్రిపాఠి కథానాయిక. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ అర్జున్‌ పాత్రలో నిఖిల్‌ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుందని సమాచారం. నైట్‌ షూట్‌ చేస్తున్నారట చిత్రబృందం.

Advertisement
 
Advertisement
Advertisement