నిహారిక రెండో సినిమా మొదలైంది..! | NIharika New movie opening | Sakshi
Sakshi News home page

నిహారిక రెండో సినిమా మొదలైంది..!

Jun 16 2017 3:22 PM | Updated on Sep 5 2017 1:47 PM

నిహారిక రెండో సినిమా మొదలైంది..!

నిహారిక రెండో సినిమా మొదలైంది..!

'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మెగా వారసురాలు నిహారిక కొణిదల. నిహారిక తెరంగేట్రంపై

'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మెగా వారసురాలు నిహారిక కొణిదల. నిహారిక తెరంగేట్రంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అయితే అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చినా మెగా హీరోలు మాత్రం నిహారికకు అండగా నిలిచారు. కానీ నిహారిక తొలి ప్రయత్నం విఫలమైంది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ మెగా బ్యూటీ తన రెండో సినిమాను స్టార్ట్ చేసింది.

ఇన్నాళ్లు మంచి కథ కోసం వెయిట్ చేసిన నిహారిక, రవి దుర్గా ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాను స్టార్ట్ చేసింది. ఈ సినిమాతో దుర్గా ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టడంతో షూటింగ్ మొదలైంది. రాఘవయ్య, బాబీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement