పవన్‌ పాటకు నిహారిక, సుహాసిని స్టెప్పులు

Niharika And Suhasini Dance for Pawan Song At Suryakantham Shoot Time - Sakshi

మెగా హీరోయిన్‌ నిహారిక, రాహుల్‌ విజయ్‌లు నటించిన ‘సూర్యకాంతం’ చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ ప్రారంభించింది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా సూర్యకాంతం షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని.. చిత్ర బృందం ప్రమోషన్‌లో భాగంగా వాడుకుంది. నిహారిక తన బాబాయి.. పవన్‌ కల్యాణ్‌ నటించిన ఖుషీ సినిమాలోని పాటకు డ్యాన్స్‌ చేశారు. అంతేకాకుండా సుహాసిని చేత కూడా డ్యాన్స్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్వాణ సినిమాస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ముద్దపప్పు ఆవకాయ్‌’ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాజీరాజా, సుహాసినిలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వరుణ్‌ తేజ్, నిర్మాతలు: సందీప్‌ ఎర్రం రెడ్డి, సృజన్‌ యారబోల్, రామ్‌ నరేశ్‌. సాహిత్యం: కృష్ణకాంత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top