ఏక్‌ దో తీన్‌...

Nidhhi Agerwal romance with Naga Shaurya - Sakshi

ఫస్ట్‌ సినిమా రిలీజ్‌ కాకముందే సెకండ్‌ సినిమా చాన్స్‌ కొట్టేస్తే లక్కీ అంటాం. సెకండ్‌ సినిమా కూడా పూర్తి కాకముందే మూడో, నాలుగో సినిమాలకూ ఆఫర్స్‌ దక్కించుకుంటే? సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ అంటాం. ప్రస్తుతం అదే ఎక్స్‌ప్రెస్‌ స్టీరింగ్‌ దగ్గర కూర్చొని ఎక్సలేటర్‌ని అమాంతం తొక్కేస్తున్నారు నిధీ అగర్వాల్‌. ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిధీ ఆ సినిమా రిలీజ్‌ కాకముందే అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ లో హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ బిజీలో ఉన్న నిధి నెక్ట్స్‌ నాగశౌర్య సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారని సమాచారం. సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ విశ్వనాథ్‌ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా నిధీని ఎంపిక చేసింది చిత్రబృందం. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరిలో మొదలు కానుంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందే సినిమాలోనూ నిధీ అగర్వాల్‌ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top