ఆ కృష్ణజింక మళ్లీ పుట్టిందా? 2038లో ఏమవుతుంది?

Netizens React to Verdict in Salman Khan Blackbuck Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలనాటి కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ జోధ్‌పూర్‌​ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై సర్వత్రా భిన్నస్పందనలు వ్యక్తమవుతున్నాయి.  ముఖ్యంగా సోషల్‌ మీడియాలో నెటిజన్లు భాయ్‌(సల్మాన్‌ఖాన్‌) పై కోర్టు తీర్పుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  

ట్రయల్‌ కోర్టు తీర్పుపై  సల్మాన్‌ ఖాన్‌ పై కోర్టుకు అప్పీల్‌కు వెళతాడని...దీనిపై  తుదితీర్పు రావడానికి మరో​ ఇరవై సంవత్సరాలు పడుతుందంటూ కమెంట్‌ చేశారు. ఈలోపు ఆయన సంతోషంగా  తన నటనను కొనసాగిస్తాడు..2038లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ట్వీట్‌ ద్వారా చురకలంటించారు. కృష‍్ణ జింక ఇప్పటికే చనిపోయి....మళ్లీ పుట్టి ఉంటుంది. తీర్పు విన్న తరువాత మన న్యాయవ్యవస్థ తీరును అభినందిస్తుందంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు.  అంతేనా సల్మాన్‌కు బెయిల్‌రావడానికి ఎంత సమయం పడుతుందో  చూద్దాం అంటూ సెటైర్‌ వేశారు. ఆశారాం బాపూ సల్మాన్‌కోసం జైల్లో ఎదురు చూస్తున్నారంటూ మరొకరు ట్వీట్‌ చేయడం విశేషం.

కాగా 1988నాటి  కేసులో గురువారం( ఏప్రిల్ 5) సల్మాన్ ఖాన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. వైల్డ్‌లైఫ్‌ (ప్రొటెక్షన్) చట్టం 1972 లోని సెక్షన్ 51 క్రింద  ఐదు సంవత్సరాల జైలు శిక్షను, జరిమానాను విధించింది. అయితే ఈ కేసులో  సహనిందితులు, నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సొనాలి బింద్రేలను  నిర్దోషులుగా విడుదల చేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top