నా భల్లాలదేవను చూసి గర్వపడుతున్నా : రాజమౌళి | Nene Raju Nene Manti movie review by Rajamouli | Sakshi
Sakshi News home page

నా భల్లాలదేవను చూసి గర్వపడుతున్నా : రాజమౌళి

Aug 11 2017 5:23 PM | Updated on Aug 11 2019 12:52 PM

నా భల్లాలదేవను చూసి గర్వపడుతున్నా : రాజమౌళి - Sakshi

నా భల్లాలదేవను చూసి గర్వపడుతున్నా : రాజమౌళి

తన సన్నిహితుల సినిమాలు రిలీజ్ అయినప్పుడు తన రివ్యూలతో సినిమాలకు బూస్ట్ ఇచ్చే దర్శకుడు రాజమౌళి నేనే రాజు నేనే మంత్రి

తన సన్నిహితుల సినిమాలు రిలీజ్ అయినప్పుడు తన రివ్యూలతో సినిమాలకు బూస్ట్ ఇచ్చే దర్శకుడు రాజమౌళి నేనే రాజు నేనే మంత్రి సినిమాపై స్పందించాడు. తన భల్లాలదేవుడి కోసం తన వంతు సాయం అందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో సినిమాపై స్పందించిన రాజమౌళి ఒక్కొక్కరిని పేరు పేరున పొగిడాడు.  'చాలా కాలం తర్వాత ఓ అర్థవంతమైన సినిమా వచ్చింది.

నేనే రాజు నేనే మంత్రి సినిమా యూనిట్ శుభాకాంక్షలు, కాజల్, కేథరిన్ లు బాగున్నారు. కట్టిపడేసే ఓపెనింగ్, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. తేజ గారు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రతీ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు ... నా భళ్లాలదేవాను చూస్తే చాలా గర్వంగా ఉంది'. అంటూ ప్రశంసించారు రాజమౌళి. ఈ శుక్రవారం గట్టి పోటి మధ్య రిలీజ్ అయిన నేనే రాజు నేనే మంత్రి సినిమా పాజిటివ్ టాక్ లో స్టార్ట్ అయ్యింది.

 

Advertisement
 
Advertisement
Advertisement