ప్రభాస్‌ అందర్నీ ప్రేమలో పడేస్తాడు! | Neil Nitin Mukesh Comment On Prabhas | Sakshi
Sakshi News home page

May 4 2018 4:45 PM | Updated on Jul 17 2019 9:52 AM

Neil Nitin Mukesh Comment On Prabhas - Sakshi

బాహుబలి సిరిస్‌తో ప్రభాస్‌ ఇండియన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అయ్యాడు. ప్రభాస్‌ గురించి ఏ చిన్న విషయమైనా దేశం మొత్తం చూస్తోంది. బాహుబలితో అంతగా ఫేమస్‌ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్‌ సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అబుదాబిలో భారీ యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్‌. 

ఈ సినిమాలో బాలీవుడ్‌​ ప్రముఖ నటుడు నీల్‌ నితీన్‌ ముఖేష్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో తను, తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌చేశాడు. ‘ నేషనల్‌ డార్లింగ్‌ ప్రభాస్‌. అతను చాలా ఆత్మీయంగా మాట్లాడుతాడు. ఆయన పిలిచిన వెంటనే మాతో వచ్చి గడిపిన తీరు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అతను అందర్నీ వెంటనే ప్రేమలో పడేస్తాడు’ అంటూ ఫోటోతో పాటు, కామెంట్‌ను పోస్ట్‌ చేశాడు. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement