కబాలి క్లైమాక్స్పై షాకింగ్ న్యూస్ | Negative ending for kabali | Sakshi
Sakshi News home page

కబాలి క్లైమాక్స్పై షాకింగ్ న్యూస్

Jul 20 2016 10:25 AM | Updated on Sep 4 2017 5:29 AM

కబాలి క్లైమాక్స్పై షాకింగ్ న్యూస్

కబాలి క్లైమాక్స్పై షాకింగ్ న్యూస్

ప్రస్తుతం ఎక్కడ చూసినా కబాలి గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియాలలో కూడా కబాలినే ట్రెండ్ అవుతోంది. అందుకే కబాలి సంబందించిన ఏ చిన్న వార్త అయినా సెన్సేషన్ క్రియేట్...

ప్రస్తుతం ఎక్కడ చూసినా కబాలి గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియాలలో కూడా కబాలినే ట్రెండ్ అవుతోంది. అందుకే కబాలి సంబందించిన ఏ చిన్న వార్త అయినా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కబాలి సినిమా క్లైమాక్స్కు సంబందించిన ఓ వార్త రజనీ అభిమానులకు షాక్ ఇస్తోంది.

ముందుగా కబాలి కథను రజనీకాంత్కు వినిపించిన దర్శకుడు పా రంజిత్ ఆ సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ను సూచించాడట. రజనీకి ఆ పాయింట్ నచ్చినా.., అభిమానులు అంగీకరిస్తోరో.. లేదో అన్న అనుమానం వ్యక్తం చేశాడట. అయితే దర్శకుడు మాత్రం సినిమాకు ఈ క్లైమాక్స్ అయితేనే కరెక్ట్ అని అదే కొనసాగించాడన్న టాక్ వినిపిస్తోంది.

నెగెటివ్ క్లైమాక్స్అంటే ఏంటి.. సినిమా చివర్లో రజనీ పాత్ర విలన్ చేతిలో ఓడిపోతుందా..? లేక కబాలి చనిపోతాడా..? నిజంగా రజనీ ఓటమిని అభిమానులు అంగీకరిస్తారా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు నిజంగానే పా రంజిత్ సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ఇచ్చాడా..? అసలు విషయం తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement