ఐయామ్‌ బ్యాక్‌ | Neeya 2 shooting update | Sakshi
Sakshi News home page

ఐయామ్‌ బ్యాక్‌

Feb 9 2018 1:37 AM | Updated on Feb 9 2018 1:37 AM

Neeya 2 shooting update - Sakshi

రాయ్‌ లక్ష్మీ

...అంటున్నారు హీరోయిన్‌ రాయ్‌ లక్ష్మీ. దాదాపు ఏడాది తర్వాత తమిళంలో ఆమె ‘నీయా 2’ అనే చిత్రం కమిట్‌ అయ్యారు. మధ్యలో హిందీ చిత్రం ‘జూలీ 2’లో నటించారు. అందుకే ‘ఐయామ్‌ బ్యాక్‌’ అన్నారు. రీసెంట్‌గా ‘నీయా 2’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘‘నీయా 2’ రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ ఏడాది తమిళ, మలయాళం, తెలుగు ప్రాజెక్ట్స్‌ కోసం బ్యాక్‌ టు బ్యాక్‌ షూట్‌లో పాల్గొనబోతున్నాను’’ అని పేర్కొన్నారు రాయ్‌ లక్ష్మీ. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ ‘నీయా 2’ చిత్రం గతంలో కమల్‌హాసన్‌ నటించిన ‘నీయా’కి సీక్వెల్‌ అని టాక్‌.

దురై దర్శకత్వంలో ఆర్‌.ముత్తురామన్, కమల్‌హాసన్, సుప్రియ, లత ముఖ్య తారలుగా 1979లో ‘నీయా’ చిత్రం రూపొందింది. ఇది హారర్‌ మూవీ. స్నేక్‌కి కీలక పాత్ర ఉంది.  ‘నీయా2’ కూడా స్నేక్‌ బేస్డ్‌ హారర్‌ మూవీ. దాంతో కమల్‌ ‘నీయా’కి ఇది సీక్వెల్‌ అనే వార్త ప్రచారంలోకొచ్చింది. అయితే చిత్రబృందం ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇందులో జై హీరోగా, రాయ్‌ లక్ష్మీ, కేథరిన్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.  మరోవైపు నటి అంజలి, రాయ్‌లక్ష్మీల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement