వరస్ట్‌ ఎంట్రీ

Neetu Chandra bags a Hollywood film titled The Worst Day - Sakshi

అనుకున్నది సక్రమంగా జరగకపోతే బ్యాడ్‌ డేగా, మరింత మిస్‌ఫైర్‌ అయితే వరస్ట్‌ డేగా భావిస్తాం. హీరోయిన్‌ నీతూచంద్ర మాత్రం వరస్ట్‌ డేనే నాకు బెస్ట్‌ అంటున్నారు. కారణం ‘వరస్ట్‌ డే’ అనే షార్ట్‌ ఫిల్మ్‌తో హాలీవుడ్‌ ఇండస్ట్రీకు ఎంట్రీ ఇవ్వడమే. ‘గోదావరి, సత్యమేవజయతే’ వంటి తెలుగుసినిమాల్లో నటించారు నీతూచంద్ర. ఇప్పుడు హాలీవుడ్‌ సినిమా చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ – ‘‘2019 నాకు అద్భుతంగా స్టార్ట్‌ అయింది. ‘వరస్ట్‌ డే’ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఇందులో నెగటివ్‌ రోల్‌ చేస్తున్నాను. ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా, భయంకరంగా ఉంటుంది. ఈ పాత్ర వల్ల నటిగా చాలా నేర్చుకునే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. స్టానిస్‌లివా అనే లాస్‌ ఏంజెల్స్‌ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు. ఇదేకాక కొరియన్‌ సినిమాలో కూడా నీతూచంద్ర కనిపించనున్నారని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top