‘తనే విడాకులు కోరుకున్నాడు’ | Neelima Azim on Divorce with Pankaj Kapur | Sakshi
Sakshi News home page

విడాకులపై స్పందించిన సీనియర్‌ నటి

May 19 2020 6:24 PM | Updated on May 19 2020 6:24 PM

Neelima Azim on Divorce with Pankaj Kapur - Sakshi

విడాకుల ఆలోచన నాది కాదు.. తనదే అంటున్నారు నటి, షాహీద్‌ కపూర్‌ తల్లి నీలిమ అజీమ్‌. బాలీవుడ్‌ యాక్టర్‌, డైరెక్టర్‌ పంకజ్‌ కపూర్‌ - నీలీమలకు 1975లో వివాహం అయ్యింది. అయితే అభిప్రాయబేధాలు రావడంతో 1984లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నీలిమ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో విడాకుల విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను విడాకులు కోరుకోలేదు. ఇది నిజం. తనే విడిపోవాలనుకున్నాడు. ఈ నిర్ణయం నన్ను ఎంతో బాధించింది. కానీ తన కారణాలు తనకున్నాయి. నా 15వ ఏట తొలిసారి నాకు పంకజ్‌తో పరిచయం ఏర్పడింది. మాది సుదీర్ఘమైన స్నేహ బంధం. తను విడాకులు అడిగినప్పుడు నేను చాలా బాధ పడ్డాను’ అన్నారు. అంతేకాక ‘ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు.. అది కూడా విడాకుల వల్ల అయితే దాని ఫలితం ఇద్దరికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం, స్నేహం ఉంటాయి. కానీ తప్పదు. జరిగిందేదో జరిగింది. తను తన కుటుంబంతో బాగా స్థిరపడ్డాడు. తను బాగుండాలని కోరుకుంటున్నాను’ అన్నారు నీలిమ. (నా పని గిన్నెలు కడగటం: షాహిద్‌)

బాలీవుడ్‌ యాక్టర్‌, డైరెక్టర్‌ పంకజ్‌ కపూర్,‌ నీలిమ అజీమ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు విడిపోయిన విషయం తెలిసిందే.  వీరిద్దరు విడిపోయేనాటికి షాహీద్‌ వయసు మూడున్నర ఏళ్లు మాత్రమే. విడాకుల అనంతరం పంకజ్‌ కపూర్‌ సుప్రియా పఠాక్‌ను వివాహం చేసుకున్నాడు. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement