మార్చి 23న ‘నీది నాది ఒకే కథ’ | Sakshi
Sakshi News home page

మార్చి 23న ‘నీది నాది ఒకే కథ’

Published Sun, Mar 11 2018 10:45 AM

Needi Naadi Oke Katha To Release On March 23rd - Sakshi

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు. టీజర్ లో చిత్తూర్ యాసలో శ్రీ విష్ణు పలికిన ఘాటైన డైలాగులకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. డిఫరెంట్‌ కాన్పెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో సక్సెస్‌ సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన ‘బిచ్చగాడు’  ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement