శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. మహిమా నంబియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు.
మే 1న మేడేని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి శ్రీవిష్ణు పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.


