ఇద్దరిదీ ఒకే కథ | 'Needi Naadi Oke Katha' gets a release date | Sakshi
Sakshi News home page

ఇద్దరిదీ ఒకే కథ

Mar 13 2018 12:55 AM | Updated on Mar 13 2018 12:55 AM

'Needi Naadi Oke Katha' gets a release date - Sakshi

శ్రీ విష్ణు

‘నువ్వు ఆత్మన్యూనతా భావంతో బాధ పడుతున్నావ్‌.. అయ్యో.. ఇదేదో బ్లడ్‌ క్యాన్సరో, మౌత్‌ క్యాన్సరో కాదు కదా అండీ?.. దానికన్నా పెద్దది’... ‘పాన్‌షాపు వాడిది బతుకు కాదా? కొబ్బరి బోండాలు అమ్ముకునేవాడిది ఓ బతుకు కాదా? మెకానిక్‌ షెడ్డు వాడిది బతుకు కాదా? డ్రైవర్‌ది బతుకు కాదా? ఏం.. మీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజనీర్లవే బతుకులా?’ వంటి డైలాగులు ‘నీది నాది ఒకే కథ’ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీ విష్ణు, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ సాట్నా టైటస్‌ జంటగా నటించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’.

వేణు ఊడుగుల దర్శ కత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. శ్రీ విష్ణు స్టూడెంట్‌గా కనిపించనున్నారు. చిత్తూరు యాసలో తను పలికిన ఘాటైన డైలాగులు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా కూడా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, దేవిప్రసాద్‌ నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కెమెరా: రాజ్‌ తోట (అర్జున్‌రెడ్డి ఫేమ్‌).

Advertisement
 
Advertisement
Advertisement