అంజలి.. చాలా పవర్‌ఫుల్‌ | Nayanthara's 'Anjali CBI Officer' seals its release date | Sakshi
Sakshi News home page

అంజలి.. చాలా పవర్‌ఫుల్‌

Feb 6 2019 3:37 AM | Updated on Feb 6 2019 3:37 AM

Nayanthara's 'Anjali CBI Officer' seals its release date - Sakshi

నయనతార

నయనతార లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగల్‌’. అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ప్రతినాయకుడిగా నటించారు. నయనతార భర్త విక్రమాదిత్యగా అతిథి పాత్రలో విజయ్‌ సేతుపతి నటించారు. ఆర్‌. అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో క్యామియో ఫిల్మ్స్‌ పతాకంపై సీజే జయకుమార్‌ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది తమిళంలో ఘన విజయం సాధించింది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్‌ బ్యానర్‌పై సీహెచ్‌ రాంబాబు, ఆచంట గోపీనాథ్‌లు ‘అంజలి సీబీఐ ఆఫీసర్‌’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పవర్‌ఫుల్‌ సీబీఐ ఆఫీసర్‌గా నయనతార టైటిల్‌ రోల్‌లో చాలా బాగా నటించారు. ప్రస్తుతం అనువాదకార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రమేష్‌ తిలక్, దేవన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, కెమెరా: ఆర్‌.డి. రాజశేఖర్‌.

Advertisement
 
Advertisement
Advertisement