అధికారం ఎప్పుడూ వాళ్లకేనా? | Nayanthara on taking on the male dominated film industry | Sakshi
Sakshi News home page

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?

Oct 7 2019 4:34 AM | Updated on Oct 7 2019 4:34 AM

Nayanthara on taking on the male dominated film industry - Sakshi

నయనతార

సినిమా ఇండస్ట్రీ మేల్‌ డామినేటెడ్‌ అంటారు కొందరు. పవర్‌ ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? అంటున్నారు నయనతార. ఒకవైపు టాప్‌ హీరోలతో యాక్ట్‌ చేస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు నయనతార. తనకి సంబంధించిన పనులు తనకు నచ్చినట్టే జరగాలనుకుంటారట నయన. ఇండస్ట్రీలో అధికారం అనే టాపిక్‌ గురించి నయనతార మాట్లాడుతూ– ‘‘అధికారం ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? నేను సోలో హీరోయిన్‌గా చేసే సినిమాల్లో తుది నిర్ణయాలన్నీ నావే. సమస్య ఏంటంటే.. స్త్రీలు శాసించే స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఉండాల్సి నంత కాన్ఫిడెంట్‌గా ఉండరు. నాకు అది కావాలి, నేను ఇది చేస్తాను అని ధైర్యంగా నిలబడరు. నిలబడాలి. ఇది జెండర్‌తో సంబంధం లేనిది. నేను నీ మాట విన్నప్పుడు, నువ్వు కూడా నా మాట వినాలి కదా?’’  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement