డబుల్‌తార

Nayanthara plays a dual role in Sarjun's next - Sakshi

ఇండస్ట్రీకి నయనతార వచ్చి దాదాపు 15 ఏళ్లు పూర్తి కావొస్తోంది. కానీ ఇప్పటివరకు సిల్వర్‌ స్క్రీన్‌పై డబుల్‌ నయనతారను చూసుండరు. ఇప్పుడు ఆ టైమ్‌ వచ్చింది. అవును.. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘మా, లక్ష్మీ’ వంటి తమిళ షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా పేరు సంపాదించుకున్న కేఎమ్‌ సర్జున్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించిన ‘ఆరమ్‌’ (తెలుగులో ‘కర్తవ్యం’) సినిమాను నిర్మించిన కేజేఆర్‌ స్టూడియోస్‌నే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఐరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ‘‘విభిన్నమైన జానర్స్‌ను ట్రై చేయడానికి ఇష్టపడుతుంటాను. కానీ హారర్‌ జానర్‌ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఇప్పుడు ఈ హారర్‌ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో రూపొందుతున్న తొలి సినిమాలోనే నయనతార నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు సర్జున్‌. ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట చిత్రబృందం. ఈ సినిమా కాకుండా మరో మూడు తమిళ సినిమాలు నయనతార బ్యాంకులో ఉన్నాయి. తెలుగులో చిరంజీవి ‘సైరా’లో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top