మిస్‌ ఫిజియో

Nayanthara is a Physiotherapy student in Thalapathy Vijay Bigil - Sakshi

ఫిజియోథెరపీ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్తున్నారు నయనతార. షూటింగ్‌లో స్టంట్స్‌ చేస్తూ గాయపడి ఫిజియో వద్దకు వెళ్తున్నారని ఊహించేసుకోవద్దు. ఫిజియో క్లాసులకు వెళ్లేది పేషెంట్‌గా కాదట.. స్టూడెంట్‌గా అని సమాచారం. నయనతార హీరోయిన్‌గా విజయ్‌తో కలసి నటిస్తున్న చిత్రం ‘బిగిల్‌’. (విజిల్‌ అని అర్థం) అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన ఫిజియోథెరపీ స్టూడెంట్‌లా కనిపిస్తారట. విజయ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌లా నటిస్తున్నారు. స్పోర్ట్స్‌ ఆడే సమయంలో ఆటగాళ్లతోనే ఫిజియోథెరపిస్ట్‌లు ఉండే సంగతి తెలిసింది. ఈ విధంగా మిస్టర్‌ కోచ్‌కి, మిస్‌ ఫిజియోకి లవ్‌ ట్రాక్‌ని దర్శకుడు కలిపారని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top