మళ్లీ సొంత గూటికి నయన్‌ | Nayanthara Living in own house Egmore | Sakshi
Sakshi News home page

మళ్లీ సొంత గూటికి నయన్‌

Apr 19 2017 2:37 AM | Updated on Sep 5 2017 9:05 AM

మళ్లీ సొంత గూటికి నయన్‌

మళ్లీ సొంత గూటికి నయన్‌

నటి నయనతార మళ్లీ సొంతగూటికి చేరారు అనగానే తనేదో మలయాళ చిత్రం చేస్తున్నారని అనుకునేరు.ఈ అమ్మడి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరం, ప్రశ్నార్థకమే అని చెప్పాలి.

నటి నయనతార మళ్లీ సొంతగూటికి చేరారు అనగానే తనేదో మలయాళ చిత్రం చేస్తున్నారని అనుకునేరు.ఈ అమ్మడి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరం, ప్రశ్నార్థకమే అని చెప్పాలి. నటిగా లేడీసూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార చాలా కాలం నక్షత్ర హోటళ్లలోనే బస చేస్తూ నిర్మాతలకు అదనపు భారాన్ని మోపుతూవచ్చారు. అలాంటిది ఆ మధ్య స్థానిక ఎగ్మూర్‌లో అధునాతన వసతులతో కూడిన ఒక అపార్టుమెంట్‌ను సొంతంగా కొనేసి అందులో నివసిస్తున్నారు. ఆ అపార్టుమెంట్‌లోనే తన తాజా ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివతో కలిసి సహజీవనం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అలాంటిది సడన్‌గా ఏమైందో ఏమోగానీ కొన్ని రోజుల నుంచి ఒక నక్షత్ర హోటల్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారు.

 దీంతో తాజా ప్రేమికుడితో ప్రేమ కథ అడ్డం తిరిగింది. తాను నటిస్తున్న వేలక్కారన్‌ చిత్ర షూటింగ్‌లో గాయాల పాలైన నయనతార చికిత్స పొందుతున్నారు లాంటి ప్రచారాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంచలన నటి నయనతార మళ్లీ ఎగ్మూర్‌లోని తన సొంత గూటికి మకాం మార్చారట. ఎందుకు హోటల్‌లో అద్దెకు రూమ్‌ తీసుకున్నారో, మళ్లీ ఎందుకు సొంత ప్లాట్‌కు చేరుకున్నారో తెలియని పరిస్థితి.

 దీంతో పోయెస్‌ గార్డెన్‌లో, అపోలో ఆస్పత్రిలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు గాని, నయనతార శింబు, ప్రభుదేవా, ఆర్యల నుంచి ఎందుకు దూరం అయ్యారో ఆ మర్మమేమిటో, అసలు ఆమె జీవితంలో రహస్యాలను తెలుసుకోవడం కష్టం అని కోలీవుడ్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అన్నట్టు ఆ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నానూమ్‌ రౌడీదాన్‌ చిత్రంలో నటించి ఆ చిత్ర మంచి విజయానికి ప్రధాన కారణంగా నిలిచి ఈ అమ్మడు తాజాగా అదే కథానాయకుడి 25వ చిత్రం సీతక్కాదిలో అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement