అవన్నీ రూమర్సే : ‘సై రా’ టీం | Nayanatara joining in Sye raa Shoot Soon | Sakshi
Sakshi News home page

Dec 30 2017 12:41 PM | Updated on Dec 30 2017 4:07 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సై రా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎదింరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకులు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తాజాగా హీరోయిన్ గా నటిస్తున్న నయనతార కూడా సై రా టీంకు హ్యాండ్ ఇచ్చిందన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. తొలి షెడ్యూల్ లో కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే చిత్రీకరించారు. దీంతో నయన్ షూటింగ్ లో పాల్గొనలేదు. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్ లో నయనతార పాల్గొననుందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement