ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్‌

Nawazuddin Siddiqui And Radhika Apte Film Raat Akeli Hai Trailr Out - Sakshi

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, హీరోయిన్‌ రాధిక ఆప్టే కలిసి నటించిన చిత్రం ‘రాత్ అకేలి హై’. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌​ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘రాత్‌ అకేలి హై’లో నవాజుద్దీన్ ఓ పవర్‌ఫుల్‌ ‌ఇన్‌స్పెక్టర్‌ జతిల్‌ యాదవ్‌ పాత్రలో కనిపించగా, రాధిక నిందితురాలిగా కనిపిస్తారు. ఓ సంపన్న రాజకీయ నాయుడి హత్య కేసు దర్యాప్తు నేపథ్యంతో ఈ సినిమా కొనసాగుతుంది. ‘రాత్ అకేలి హై’కి కాస్టింగ్‌ డైరెక్టర్‌ హనీ ట్రెహన్‌ దర్శకత్వం వహించారు. అతనికి ఇది మొదటి సినిమా. ఈ చిత్రంలో నవాజుద్దీన్‌, రాధిక ఆప్టేతో పాటు ఆదిత్య శ్రీవాస్తవ, శ్వేతా త్రిపాఠి, ఇలా అరుణ్, ఖలీద్ త్యాబ్జీ, శివాని రఘువంశి, టిగ్మాన్షు ధులియా నటించారు. ఈ చిత్రం జూలై 31న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా  విడుదల కానుంది. (అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన)

‘అత్యంత శక్తివంతమైనవారు సాధారణంగా చీకటి రహస్యాలను దాచిపెడతారు. చాలా పలుకుబడి ఉన్న స్థానిక రాజకీయ నాయకుడి కేసును విచారించడానికి ఒక చిన్న పట్టణ పోలీసుకు అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది. అతను కేసును విచారించటంలో ఎంత మేరకు సిద్ధంగా ఉన్నాడు. సత్యం కోసం వెతకడానికి చీకటిలోకి వెళ్లాలి. కుటుంబానికి చెందిన వారే అనుమానితులుగా ఉన్న ఈ రహస్య హత్యలో ఇన్‌స్పెక్టర్‌ జతిల్‌ యాదవ్‌ కేసును ఏలా చేధిస్తారనేది సినిమాలో చూడాలని చిత్ర నిర్మాతల్లో ఒకరు పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top