నమ్మకం నిజమైంది | natakam movie success meet | Sakshi
Sakshi News home page

నమ్మకం నిజమైంది

Sep 30 2018 4:05 AM | Updated on Sep 30 2018 4:05 AM

natakam movie success meet - Sakshi

రిజ్వాన్, కల్యాణ్, ఆశిష్‌ గాంధీ, సాయి కార్తీక్‌

ఆశిష్‌ గాంధీ, ఆషిమా నర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. కల్యాణ్‌ జీ గోగన దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో చిత్రనిర్మాత రిజ్వాన్‌ మాట్లాడుతూ– ‘‘కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కొన్నాను.  మీరు (ప్రేక్షకులు) ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు, నా నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్‌. మా బ్యానర్‌లో ఫస్ట్‌ ఫిల్మ్‌ ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాను’’ అన్నారు.

హీరో ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ– ‘‘అందరూ ఫోన్‌ చేసి సినిమా చాలా బావుందని మన దేశం నుండే కాదు, యూకే నుండి కూడా మంచి టాక్‌ వచ్చిందని చెప్తున్నారు. సినిమాని వేరే ప్లేసెస్‌లో కూడా రిలీజ్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను మళ్లీ మళ్లీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్‌ బాగా వచ్చాయి. మౌత్‌ టాకే మా సినిమాకి మెయిన్‌ పబ్లిసిటీ’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement