'ఎక్స్‌ట్రా ముద్దులా.. ఎక్కువ డబ్బివ్వండి' | Nargis Fakhri wanted to charge extra for extra liplocks with Emraan Hashmi | Sakshi
Sakshi News home page

'ఎక్స్‌ట్రా ముద్దులా.. ఎక్కువ డబ్బివ్వండి'

May 2 2016 7:33 PM | Updated on Sep 3 2017 11:16 PM

'ఎక్స్‌ట్రా ముద్దులా.. ఎక్కువ డబ్బివ్వండి'

'ఎక్స్‌ట్రా ముద్దులా.. ఎక్కువ డబ్బివ్వండి'

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇమ్రాన్ హష్మి తాజా సినిమా 'అజార్‌'.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇమ్రాన్ హష్మి తాజా సినిమా 'అజార్‌'. ఈ సినిమా ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ-నర్గీస్‌ ఫక్రీ మధ్య హాట్‌ హాట్‌ ముద్దుసీన్లను రెండోసారి తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావించారట. ఈ సినిమాలో అజార్‌ రెండో భార్య సంగీత బిజ్‌లానీ పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడికి ఇలా రెండోసారి తెరకెక్కించడం చాలా చికాకు తెప్పించిందట. అందుకే ఎక్స్‌ట్రా లిప్‌లాక్‌ సీన్లు చేయాలంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తాను తేల్చిచెప్పినట్టు నర్గీస్ వెల్లడించింది.

'సినిమాలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని నాకు తెలియదు. ఇన్ని సీన్లు ఉండటం నాకు చికాకు తెప్పించింది. ఇందుకు ఎక్కువ చార్జ్‌ చేయాలనిపించింది. అందులోనూ ఎన్నో రీటేక్‌లు, రీషూట్‌లు ఉన్నాయి. వీటిని చేయడమంటే మాటలా' అంటూ నర్గీస్ కుండబద్దలు కొట్టింది. ముద్దుసీన్లు, ఘాటైన శృంగార దృశ్యాల్లో నటించాలంటే తనకు చాలా ఇబ్బంది అనిపిస్తుందని ఆమె తెలిపింది. 'రాక్‌స్టార్‌' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ 36 ఏళ్ల భామ అదే సమయంలో సహ నటుడు ఇమ్రాన్ హష్మిపై ప్రశంసల జల్లు కురిపించింది. అతను చాలా కూల్‌గా ఉంటాడని, ఎంత ఒదిగినా ఒదిగి ఉంటాడని, చాలా ప్రొఫెషనల్‌ అని చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement