నారావారబ్బాయిని లైన్లో పెట్టాడు | Nara Rohith with puri Jaganath | Sakshi
Sakshi News home page

నారావారబ్బాయిని లైన్లో పెట్టాడు

Apr 1 2016 7:30 PM | Updated on Mar 22 2019 1:53 PM

నారావారబ్బాయిని లైన్లో పెట్టాడు - Sakshi

నారావారబ్బాయిని లైన్లో పెట్టాడు

టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న పూరిజగన్నాథ్, కొద్ది రోజులుగా తన స్ధాయికి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నాడు.

టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న పూరిజగన్నాథ్, కొద్ది రోజులుగా తన స్ధాయికి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా హడావిడిగా సినిమాలు చేసేయడంతో క్వాలిటీ ప్రాజెక్ట్స్ రావటం లేదన్నది పూరి మీద కంప్లయింట్. అందుకే స్టార్ హీరోలతో అనుకున్న పూరి సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి.

అయితే పూరి మాత్రం వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ పోతున్నాడు. ప్రస్తుతం ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ రోగ్ సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, ఆ తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండూ పూర్తయిన తరువాత మరోసారి ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయనున్నాడు. ఇలా చేతినిండా సినిమాలు ఉండగానే ఇప్పుడు మరో హీరోని కూడా లైన్లో పెట్టాడు.

ప్రస్తుతం ఏడెనిమిది సినిమాల్లో నటిస్తున్న యంగ్ హీరో నారా రోహిత్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు పూరి. సావిత్రి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రోహిత్, త్వరలో రాజా చెయ్యివేస్తే సినిమాను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు. వీటితో పాటు జ్యో అచ్యుతానంద, శంకర లాంటి అరడజనుకు పైగా సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. అదే లైన్లో పూరి దర్శకత్వంలో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు రోహిత్.

Advertisement
 
Advertisement
Advertisement