విమర్శకులు అభినందించడం ఆనందంగా ఉంది

Nannu Dochukunduvate Movie Thank You Meet - Sakshi

సుధీర్‌బాబు

‘‘ఫ్యామిలీ అంతా కలసి చూసే మూవీ నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. మౌత్‌ టాక్‌తో  పెద్ద సక్సెస్‌వైపుకు వెళ్తుందీ సినిమా. విమర్శకులు కూడా అభినందించడం ఆనందంగా ఉంది’’ అని సుధీర్‌బాబు అన్నారు. ఆర్‌.ఎస్‌.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్‌ నటించి, నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభా నటేశ్‌ కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్‌ అయింది. శనివారం ‘థ్యాంక్స్‌ మీట్‌’ నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘సెన్సార్‌ వాళ్లు బావుంది అని చెప్పడంతోనే నమ్మకం వచ్చింది. హరీష్‌ శంకర్, రానా, మోహన్‌ కష్ణ ఇంద్రగంటి, సందీప్‌ కిషన్, గోపీమోహన్‌  అందరూ సోషల్‌ మీడియా ద్వారా సపోర్ట్‌ అందించారు. ఆర్‌.ఎస్‌ నాయుడు బాగా తీశాడు.

‘అష్టా చమ్మా’లో స్వాతి, ‘బొమ్మరిల్లు’లో జెనీలియా ఈ సినిమాలో నభా అంటున్నారు నభాను. కామెడీ వర్కౌట్‌ అవుతుందా అనుకునేవాణ్ణి. షార్ట్‌ ఫిల్మ్‌ సీన్‌  బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘సుధీర్‌ మంచి కో–స్టార్‌. ప్రొడ్యూసర్‌గా నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌. మంచి రోల్‌ రాసినందుకు డైరెక్టర్‌గారికి థ్యాంక్స్‌. అమేజింగ్‌ సక్సెస్‌లో నన్ను భాగం చేసినందుకు థ్యాంక్స్‌. బాగా యాక్ట్‌ చేశాను అని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నభా నటేశ్‌. ‘‘కామెడీ, ఎమోషనల్‌ సీన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. తండ్రీ, కొడుకుల ఎమోషనల్‌ సీన్స్‌కు రెస్పాన్స్‌ బావుంది. సుధీర్‌గారు నన్ను నమ్మి చేసిన కథ ఇది. నభా చాలా బాగా చేసింది’’ అన్నారు ఆర్‌ఎస్‌ నాయుడు.  సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్, ఎడిటర్‌ చోటా ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top