నాన్న... బాయ్‌ఫ్రెండ్స్.. ఓ అమ్మాయి! | Nanna Nenu Naa Boyfriends Theatrical Trailer released | Sakshi
Sakshi News home page

నాన్న... బాయ్‌ఫ్రెండ్స్.. ఓ అమ్మాయి!

Nov 7 2016 11:58 PM | Updated on Sep 4 2017 7:28 PM

నాన్న... బాయ్‌ఫ్రెండ్స్.. ఓ అమ్మాయి!

నాన్న... బాయ్‌ఫ్రెండ్స్.. ఓ అమ్మాయి!

‘‘నా దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన భాస్కర్ నా కుటుంబ సభ్యుడిలాంటి వాడు. తను ఈ చిత్రకథ చెప్పగానే వేణుగోపాల్‌కి నేనే ఫోన్ చేశా.

‘‘నా దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన భాస్కర్ నా కుటుంబ సభ్యుడిలాంటి వాడు. తను ఈ చిత్రకథ చెప్పగానే వేణుగోపాల్‌కి నేనే ఫోన్ చేశా. ‘దిల్’రాజు ఈ చిత్రంలోకి ఎంటరయ్యాక మరింత గ్లామర్ వచ్చింది. ఆయన సినిమా టేకప్ చేశారంటే బావున్నట్టే లెక్క’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ ప్రధానపాత్రల్లో భాస్కర్ బండిని దర్శకునిగా పరిచయం చేస్తూ బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘నాన్న... నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’.

ఈ సినిమా టీజర్‌ను వినాయక్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘తండ్రి, కూతురు మధ్య సాగే కథ ఇది. కూతురున్న ప్రతి తండ్రికి, ఆ కుటుంబానికి బాగా నచ్చుతుంది. తొలుత ఈ చిత్రానికి ‘నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ టైటిల్ అనుకున్నారు. కథ విన్నాక ‘నాన్న... నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’ కరెక్ట్‌గా ఉంటుందని చెప్పా. ఈ చిత్రాన్ని మా బ్యానర్‌లో విడుదల చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. భాస్కర్ చక్కగా తీర్చిదిద్దాడు. త్వరలో పాటలు రిలీజ్ చేసి, డిసెంబర్ 9న ఈ చిత్రం విడుదల చేస్తాం’’ అని తెలిపారు. బెక్కం వేణుగోపాల్, భాస్కర్ బండి, హెబ్బా పటేల్, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: ఛోటా కె.నాయుడు.

Advertisement
 
Advertisement
Advertisement