breaking news
Nanna Nenu Naa Boyfriends
-
నాన్న... బాయ్‌ఫ్రెండ్స్.. ఓ అమ్మాయి!
‘‘నా దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన భాస్కర్ నా కుటుంబ సభ్యుడిలాంటి వాడు. తను ఈ చిత్రకథ చెప్పగానే వేణుగోపాల్‌కి నేనే ఫోన్ చేశా. ‘దిల్’రాజు ఈ చిత్రంలోకి ఎంటరయ్యాక మరింత గ్లామర్ వచ్చింది. ఆయన సినిమా టేకప్ చేశారంటే బావున్నట్టే లెక్క’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ ప్రధానపాత్రల్లో భాస్కర్ బండిని దర్శకునిగా పరిచయం చేస్తూ బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘నాన్న... నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ సినిమా టీజర్‌ను వినాయక్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘తండ్రి, కూతురు మధ్య సాగే కథ ఇది. కూతురున్న ప్రతి తండ్రికి, ఆ కుటుంబానికి బాగా నచ్చుతుంది. తొలుత ఈ చిత్రానికి ‘నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ టైటిల్ అనుకున్నారు. కథ విన్నాక ‘నాన్న... నేను... నా బాయ్‌ఫ్రెండ్స్’ కరెక్ట్‌గా ఉంటుందని చెప్పా. ఈ చిత్రాన్ని మా బ్యానర్లో విడుదల చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. భాస్కర్ చక్కగా తీర్చిదిద్దాడు. త్వరలో పాటలు రిలీజ్ చేసి, డిసెంబర్ 9న ఈ చిత్రం విడుదల చేస్తాం’’ అని తెలిపారు. బెక్కం వేణుగోపాల్, భాస్కర్ బండి, హెబ్బా పటేల్, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
నాన్న.. హెబ్బా..బాయ్‌ఫ్రెండ్స్!
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండిని దర్శకునిగా పరిచయం చేస్తూ లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన తాజా చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. రావు రమేశ్, అశ్విన్‌బాబు, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిజిటల్ పోస్టర్, ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ కథ కోసం ఏడాదిగా కసరత్తు చేశాం. తొలుత ‘దిల్’ రాజుగారికి స్టోరీ వినిపిస్తే, ఆయన కొన్ని మార్పులు చేయమన్నారు. ఫైనల్‌గా ఫస్ట్‌కాపీ చూసిన ఆయన సినిమా బావుందంటూ అభినందించి, మా చిత్రాన్ని విడుదల చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారు. గతంలో ‘సినిమా చూపిస్త మావ’ నైజాం హక్కులు ఆయనే సొంతం చేసుకున్నారు. త్వరలో పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. నోయల్, కృష్ణ భగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: చోటా కె.నాయుడు.