ఉయ్యాల జంపాల డైరెక్టర్తో నాని | nanis next with young director virinchi varma | Sakshi
Sakshi News home page

ఉయ్యాల జంపాల డైరెక్టర్తో నాని

Mar 12 2016 1:50 PM | Updated on Sep 3 2017 7:35 PM

ఉయ్యాల జంపాల డైరెక్టర్తో నాని

ఉయ్యాల జంపాల డైరెక్టర్తో నాని

ఉయ్యాల జంపాల సినిమాతో మంచి విజయం సాధించిన యువ దర్శకుడు విరించి వర్మ.

ఉయ్యాల జంపాల సినిమాతో మంచి విజయం సాధించిన యువ దర్శకుడు విరించి వర్మ. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించినా.. తరువాత అవకాశాలు పొందటంలో మాత్రం ఈ యువ దర్శకుడు వెనకపడ్డాడు. తొలి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వర్మ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నయంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలతో సూపర్ ఫాంలో ఉన్న నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విరించి వర్మతో కలిసి పనిచేయడానికి అంగీకరించాడు నాని. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్న వర్మ, నటీనటులు ఎంపిక కూడా మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement