విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నేచురల్ స్టార్ నాని. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.
96 దర్శకుడితో నాని సినిమా?
‘96’, ‘సత్యం సుందరం’ వంటి చిత్రాలతో భావోద్వేగభరితమైన కథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆయన దర్శకత్వంలో నాని నటించనున్నారనే వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
హీరోయిన్‌గా రుక్మిణి?
ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా రుక్మిణిని ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ జోడీని తెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘బ్లడీ రోమియో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రేమ్ కుమార్‌తో తెరకెక్కనున్న ప్రేమకథ పట్టాలెక్కించే అవకాశం ఉందని సమాచారం.
(ఇదీ చదవండి: నా ఫొటోలు దారుణంగా మార్ఫింగ్ చేశారు: స్టార్ నటి)


