రేపే రణబాలి విడుదల.. అంచనాలు పెంచేసిన హీరో నాని | Nani Praises Vijay Deverakonda Transformation as Ranabaali Ahead of Release | Sakshi
Sakshi News home page

Nani About Ranabaali: రణబాలి పై అంచనాలు పెంచేసిన నాని

Oct 15 2026 4:33 PM | Updated on Oct 15 2026 4:41 PM

Nani Praises Vijay Deverakonda Transformation as Ranabaali Ahead of Release

టాలీవుడ్‌లో ‘రణబాలి’ సందడి మొదలైంది.  విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం రేపు (అక్టోబర్ 16) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ‘రణబాలి’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇప్పుడీ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

‘రణబాలి’ అనే ఉగ్రరూపం దాల్చిన వ్యక్తిగా
‘రణబాలి’ సినిమా కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడింది. కథ ప్రాధాన్యతను గుర్తించి, ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లు సినిమా ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటివరకు అందరికీ తెలిసిన కూల్ విజయ్ దేవరకొండ నుంచి ‘రణబాలి’ అనే ఉగ్రరూపం దాల్చిన వ్యక్తిగా ఆయన మారిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. విజయ్ తన పాత్ర కోసం ఎంతో సహజంగా మారిపోయాడు. జయమ్మగా రష్మిక ఎంతో సహజంగా, ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌  ప్రతిభ కనిపిస్తోంది’ అని నాని ఎక్స్‌ వేదికగా ప్రశంసించారు.

రేపు విడుదల కానున్న ‘రణబాలి’ చిత్ర బృందం మొత్తానికి నాని తన ప్రేమాభిమానాలతో కూడిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘గీత గోవిందం’తో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ‘రణబాలి’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

(ఇదీ చదవండి: ‘జైలర్‌ 2’పై హీరో ధనుష్‌ మూవీ రివ్యూ..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement