మంచోడే కానీ...! | Nani's Gentleman Censor report | Sakshi
Sakshi News home page

మంచోడే కానీ...!

Jun 10 2016 11:20 PM | Updated on Aug 11 2019 12:30 PM

మంచోడే కానీ...! - Sakshi

మంచోడే కానీ...!

‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు లక్కీగా నవ్విస్తే, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో ప్రేమ కోసం ధైర్యంగా...

‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు లక్కీగా నవ్విస్తే, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో ప్రేమ కోసం ధైర్యంగా పోరాడే కృష్ణగా నవ్వించి, ఏడ్పించారు నాని. ఇప్పుడు జెంటిల్‌మన్‌గా అలరించడానికి రెడీ అయ్యారు. అప్పట్లో సహాయ దర్శకునిగా ఉన్న నానీతో ‘అష్టా-చమ్మా’ ఆడించేసి, అతన్ని హీరోని చేశారు దర్శకుడు ఇంద్రగంటి  మోహనకృష్ణ. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జెంటిల్‌మన్’. పేరుకి జెంటిల్‌మన్ అయినా హీరో వ్యక్తిత్వానికి నెగటివ్ షేడ్ కూడా ఉంది. మరి.. జెంటిల్‌మన్ ఎలా అవుతాడు అనుకుంటున్నారా?

ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే  ఈ నెల 17న విడుదల కానున్న ‘జెంటిల్‌మన్’ సినిమా చూడాల్సిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా  శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది.  అందమైన రొమాంటిక్ ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది’’అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, కెమేరా: పీజీ విందా.

Advertisement
 
Advertisement
Advertisement