నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ | Nani, Vikram Kumar's new film launched | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

Feb 19 2019 2:44 AM | Updated on Feb 19 2019 2:44 AM

Nani, Vikram Kumar's new film launched - Sakshi

చెర్రీ, సీవీయం మోహన్, నాని, విక్రమ్‌ కె. కుమార్, రవిశంకర్, కొరటాల శివ...

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాణంలో నాని, విక్రమ్‌ కె. కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రం పూజాకార్యక్రమాలు సోమవారం జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత సుధాకర్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత శరత్‌ మరార్‌ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందించారు. ఈ రోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ మాట్లాడుతూ – ‘‘తొలిసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ చేస్తున్నాను.

ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ కూడా సినిమాలో ఉంటుంది. అదేంటో స్క్రీన్‌పైన చూస్తేనే  బావుంటుంది’’ అన్నారు. ‘‘మా బ్యానర్‌లో వస్తున్న మరో విభిన్నమైన సినిమా ఇది. ఈరోజు నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుగుతుంది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్, కెమెరా: మిరోస్లా కుబా బ్రోజెక్, రచనా సహకారం: ముకుంద్, మాటలు: Ðð ంకీ, ‘డార్లింగ్‌’ స్వామి.

Advertisement
 
Advertisement
Advertisement