మరో మల్టీస్టారర్‌.. హీరోలు ఫిక్స్‌ | Nani Sharwanand In Indraganti Mohan Krishna Multi Starrer | Sakshi
Sakshi News home page

Jul 14 2018 2:04 PM | Updated on Jul 14 2018 4:49 PM

Nani Sharwanand In Indraganti Mohan Krishna Multi Starrer - Sakshi

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందుకు ఈ జానర్‌లో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ జనరేషన్‌లో మల్టీస్టారర్‌ సినిమాలకు తెరతీసిన టాలీవుడ్‌ నిర్మాత దిల్ రాజు వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలను నిర్మిస్తున్నారు.

దిల్ రాజు నిర్మాతగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్ తేజ్‌ హీరోలుగా ఎఫ్ 2 సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల సమ్మోహనం సినిమాతో సూపర్‌ హిట్ అందకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరోస్టారర్‌ నిర్మించనున్నట్టుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై మరో ఆసక్తికర అప్‌ డేట్ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని, శర్వానంద్‌ లు హీరోలుగా నటించనున్నారట. గతంలో నాని హీరోగా థ్రిల్లర్ జానర్‌లో జెంటిల్‌మెన్‌ సినిమాను తెరకెక్కించి సక్సెష్‌ అయిన ఇంద్రగంటి మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement