'నేను లోకల్' అంటున్న నాని | Nani’s new film gets a title | Sakshi
Sakshi News home page

'నేను లోకల్' అంటున్న నాని

Aug 9 2016 4:19 PM | Updated on Sep 4 2017 8:34 AM

'నేను లోకల్' అంటున్న నాని

'నేను లోకల్' అంటున్న నాని

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో సినిమాకు కమిట్ అయ్యాడు. 'సినిమా చూపిస్త మామ' ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభం కానుంది.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో సినిమాకు కమిట్ అయ్యాడు. 'సినిమా చూపిస్త మామ' ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రానికి 'నేను లోకల్' అనే టైటిల్ను కన్ఫామ్ చేశారు. నాని సరసన 'నేను.. శైలజ' ఫేం కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టెయినర్గా తెరకెక్కనుంది.

కాగా నాని ప్రస్తుతం నటిస్తున్న 'మజ్ను' సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మజ్ను చిత్రానికి 'ఉయ్యాల జంపాల' ఫేం విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన అను ఎమ్మానుయేల్ అనే నూతన తార హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement