నాని ఖాతాలో మరో వెరైటీ టైటిల్ | Nani next movie title evadithadu | Sakshi
Sakshi News home page

నాని ఖాతాలో మరో వెరైటీ టైటిల్

Apr 5 2016 12:25 PM | Updated on Sep 3 2017 9:16 PM

నాని ఖాతాలో మరో వెరైటీ టైటిల్

నాని ఖాతాలో మరో వెరైటీ టైటిల్

కొద్ది రోజులుగా తన సినిమా టైటిల్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్న నాని మరోసారి అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో ఎవడే సుబ్రమణ్యం అనే టైటిల్తో వచ్చిన నాని...

కొద్ది రోజులుగా తన సినిమా టైటిల్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్న నాని మరోసారి అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో ఎవడే సుబ్రమణ్యం అనే టైటిల్తో వచ్చిన నాని మంచి విజయం సాధించాడు. కేవలం టైటిల్ పరంగానే కాదు కథా కథనాల పరంగా కూడా ఆకట్టుకున్న ఈ సినిమా, నాని కెరీర్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. తరువాత కూడా టైటిల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.
 
మారుతి దర్శకత్వంలో భలే భలే మొగాడివోయ్ టైటిల్తో ఆకట్టుకున్న నాని, తరువాత కృష్ణగాడి వీర ప్రేమగాథ అంటూ పొడవాటి టైటిల్తో కూడా మెప్పించాడు. ఈ రెండు సినిమాలు నానికి స్టార్ ఇమేజ్ను సాధించి పెట్టాయి. తాజాగా తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నాని, ఈ సినిమాకు కూడా ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫైనల్ చేశాడు. ముందుగా ఈ సినిమాకు ధమాకా అనే టైటిల్ను నిర్ణయించినా, ఫైనల్గా ఎవడితడు అనే టైటిల్ను కన్ఫామ్ చేశారు. నాని సరసన నివేదితా థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement