నాని థ్రిల్‌

Nani Movie With Vikram K Kumar - Sakshi

ఇప్పటి వరకూ పలు వైవిధ్యమైన చిత్రాల్లో కనిపించిన నాని హారర్, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాల్లో నటించలేదు. అయితే.. తాజాగా నాని ఓ పూర్తి స్థాయి థ్రిల్లర్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అది కూడా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అట. నాని నటించిన  ‘కృష్ణార్జున యుద్ధం’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్‌ చిత్రంలో నటిస్తున్నారు నాని.

ఈ సినిమా తర్వాత నాని ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో నెలకొంది. ‘నాలుగైదు కథలు విన్నా.. ఏ దర్శకుడి చిత్రం ముందుగా సెట్స్‌పైకి వెళుతుందో ఇప్పుడే చెప్పలేను’ అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు నాని. తాజా సమాచారం ఏంటంటే.. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నాని తర్వాతి సినిమా చేయనున్నారట. విక్రమ్‌ చెప్పిన ఓ థ్రిల్లర్‌ స్టోరీ నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top