‘ఆడోళ్లు భలే కఠినాత్ములనిరా’ | Nani Krishnarjuna Yuddham Teaser | Sakshi
Sakshi News home page

Mar 10 2018 10:28 AM | Updated on Mar 10 2018 2:17 PM

Nani Krishnarjuna Yuddham Teaser - Sakshi

‘కృష్ణార్జున యుద‍్ధం’ సినిమాలో నాని

యంగ్‌ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఇప్పటికే డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలతో సత్తా చాటిన నాని తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. తాజాగా కృష్ణార్జున యుద్ధంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మాస్‌ కుర్రాడిగా కనిపిస్తే మరో పాత్రలో ఫారిన్‌ లో ఉండే రాక్‌ స్టార్‌ల కనిపిస్తున్నాడు.

అనుపమా పరమేశ్వరన్‌, రుక్సర్‌ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్‌ హాప్‌ తమిళ సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్‌ 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించింది చిత్రయూనిట్. తాజాగా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. నాని మార్క్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో రూపొందిన టీజర్‌ ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement